కరోనా పేషెంట్ల కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగం

కరోనా పేషెంట్ల కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగం

హైదరాబాద్‌: కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో హీల్ఫా యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ శిఖా గోయల్. సోమవారం సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన శిఖా గోయల్..  తమ కంపానియన్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను మెరుగ్గా వినియోగించుకుని ఆరోగ్య సంరక్షణ, సమగ్ర నిర్వహణ హీల్పాతో సాధ్యమవుతుందన్నారు. దీని ఫీచర్లలో టెలి కన్సల్టింగ్‌, ఫిజిషీయన్ల చేత పర్యవేక్షణ, యాప్‌ లోతరచుగా పర్యవేక్షణ చేయడంతో పాటు.. పరీక్షలను.. పారామెడిక్స్‌, నర్సుల సాయంతో రిమోట్‌గా చేస్తుందన్నారు. 
డాక్టర్లు, ఎన్‌జీఓల చేత అద్భుతమైన సమీక్షా సమావేశం జరిగిందని తెలిపారు. హీల్ఫాతో మా భాగస్వామ్యం, మా సిబ్బందిలో కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్యం జాగ్రత్తగా పర్యవేక్షించడంలో తోడ్పడుతుందని చెప్పారు. ఇది అడ్మిషన్లు, మరణాలను తగ్గించడంలో తోడ్పడిందని.. ఈ తరహా కమ్యూనిటీ యాప్స్‌ సమాజానికి అత్యంత అవసరమని నమ్ముతున్నామన్నారు. సురక్షితమైన, అతి తక్కువ ఖర్చుతో సంరక్షణను అందించడంలో సహాయపడుతుందని.. భద్రతకు భరోసానందిస్తూనే వినియోగదారులకు ఆరోగ్య సమాచారం పొందే అవకాశం ఇది అందిస్తుంది. నాణ్యమైన ఆరోగ్యం సమాజానికి అందించడానికి హీల్ఫా సహాయపడుతుందన్నారు.