వచ్చే ఐదేళ్లకు ఈ బడ్జెట్ గట్టి పునాది వేస్తుంది : వినోద్ కుమార్

వచ్చే ఐదేళ్లకు ఈ బడ్జెట్ గట్టి పునాది వేస్తుంది : వినోద్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కొనియాడారు. హరీశ్ రావు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని మెచ్చుకున్నారు. వచ్చే ఐదేళ్లకు ఈ బడ్జెట్ గట్టి పునాది వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగినట్లు బడ్జెట్ లో చెప్పారన్న వినోద్ కుమార్... అనేక రంగాల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి మంచి కేటాయింపులు ఇవ్వడం శుభసూచకమన్నారు. 

కేసీఆర్ వేసిన పునాది వల్లే ఇవాళ దాదాపు రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించారని వినోద్ కుమార్ చెప్పారు. 2004లో కేంద్ర బడ్జెట్టే రూ,4 లక్షల కోట్లు ఉండేదని... ఇప్పుడు ఒక్క రాష్ట్రమే ఆ స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. అప్పుల విషయంలో కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు చేయడం లేదనే కారణంగా రుణపరిమితిని 0.5శాతం తగ్గించారన్నారు. ఏది ఏమైనా రాష్ట్రం ఇవాళ మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు.