జబ్బులు పోగొట్టే కోకా కోలా సరస్సు!.. ఎక్కడ ఉందంటే?

జబ్బులు పోగొట్టే కోకా కోలా సరస్సు!.. ఎక్కడ ఉందంటే?

ప్రపంచంలోనే అతి పెద్ద కూల్‌డ్రింక్స్‌ బ్రాండ్ కోకా కోలా.. చిన్న పల్లెటూరికి పోయినా ఈ కూల్‌డ్రింక్స్‌ తెలియనివాళ్లు ఉండరు. అయితే కోకా కోలా సరస్సు ఒకటుందని ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా దానిని చూశారా? అదేంటి అసలు కోకా కోలా సరస్సు ఎలా ఉంటుంది అన్న అనుమానం వస్తోందా? అయితే పకృత్రిలో ఉన్న వింతల్లో ఒకటైన ఈ సరస్సు గురించి తెలుసుకోవాల్సిందే!!

అసలు పేరు అరారాక్వారా లేక్

కోకా కోలా సరస్సు బ్రెజిల్‌లో ఉంది. ఇది కోకా కోలా డ్రింక్‌తో నింపిన సరస్సో లేక ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సరస్సో కాదు. ప్రకృతి సహజంగా ఏర్పడిన లేక్ ఇది. బ్రెజిల్‌లో అతి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఆ దేశంలోని రియో గ్రాండ్ డెల్ నొర్టె రీజియన్‌లోని మాటా డీ ఎస్టరలా రిజర్వ్‌లో ఈ కోకా కోలా సరస్సు ఉంది. అట్లాంటిక్‌ ఫారెస్ట్ రిజర్వ్‌లో ఇది ఉంది. దీనిని లగావో డీ కోకా కోలా అని కూడా పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ సరస్సు పేరు అరారాక్వారా సరస్సు. దానిలో ఉండే వాటర్ కలర్ కారణంగా ఇది కోకా కోలా లేక్ అనే పేరుతో పాపులర్ అయిపోయింది.

లోకల్స్ నమ్మకం

కోకా కోలా లేక్‌లో నీటిలో మునిగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. టూరిస్టులు ఎవరూ ఈ నీటిలో మునగడానికి భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి కాలుష్యం లేదని బ్రెజిల్ టూరిజం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. పైగా ఈ నీటికి జబ్బులను పోగొట్టే శక్తి ఉందని లోకల్స్ నమ్ముతారట. చుట్టూ తెల్లటి ఇసుక తిన్నెలు, పచ్చటి చెట్లతో నిండిన కొండలు ఉండడం వల్ల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.

సైంటిఫిక్ రీజన్: ఈ సరస్సులోని నీరు ఇలా కోకా కోలా డ్రింక్‌లా కలర్‌‌ ఫుల్‌గా కనిపించడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అక్కడి నేలలోని కెమికల్ కాంబినేషన్‌ వల్లే ఆ వాటర్ ఇలా ఉన్నాయి. నేలలో ఐరన్‌ఆక్సైడ్‌, అయోడిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్లే ఆ డార్క్ కలర్‌‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.