Cannibal Holocaust: స్టోరీ ఏంటంటే..ఈ ఇటలీ సినిమా 50 దేశాల్లో బ్యాన్

Cannibal Holocaust: స్టోరీ ఏంటంటే..ఈ ఇటలీ సినిమా 50 దేశాల్లో బ్యాన్

సినిమా..ఎవ్వరినైనా కదిలించేలా చేస్తోంది. ఒక మంచి విషయంలో ప్రేరణ పొందడానికి అయిన..ఒక చెడు విషయానికి లోనయ్యేలాచేయడానికైనా..అంతటి  ప్రభావం చూపే శక్తి సినిమాకి ఉంటుంది. అందులో కొన్ని సినిమాలు ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి, కొన్ని సినిమాలు ప్రేక్షకులపై హింసాత్మక ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో హింసాత్మకమైన సీన్స్ చూసుంటారు.

అందులో కొన్నిటీకి వావ్ అనుంటారు..వీలైతే మళ్ళీ మళ్ళీ కూడా చూసుంటారు. కానీ, మీరు ఇంతవరకు ఇలాంటి సినిమా ఒకటి చూడకపోవోచ్చు. అదే నరమాంస హోలోకాస్ట్ (Cannibal Holocaust). 1980లో వచ్చిన ఇటాలియన్ సినిమా( Italian film)..ఇందులో చూపించిన భయంకరమైన హింసాత్మక కంటెంట్ చుసిన సర్టిఫికేషన్ బోర్డుకే కంగు తినేలా చేసిన సినిమా.కనుకే ఈ సినిమాను 50 కంటే ఎక్కువ దేశాల్లో బ్యాన్ చేశారు. ఈ సినిమా రగ్గేరో డియోడాటో (Ruggero Deodato) డైరెక్షన్లో తెరకెక్కించబడింది. 

స్టోరీ ఏంటంటే..

నరమాంస హోలోకాస్ట్ మూవీలో డైరెక్టర్ భయంకరమైన హింసాత్మక సన్నివేశాలను డైరెక్ట్ గా జంతువుల ముందు చూపించడంతో పాటు..కెమెరా ముందు జంతువులను కిరాతకంగా చంపేలా చేసాడు. అంతేకాదు..డైరెక్టర్ రగ్గేరో జంతు హింసకే పరిమితం కాలేదు. కళ్ళు బయిర్లు కమ్మే రియలిస్టిక్ రేప్ సన్నివేశాలను కూడా చూపించాలనుకున్నాడు. ఇందులో నటించే నటీనటులను అలా చేయమని ఒప్పించాడు. దీంతో ఇందులో నటించిన నటీనటులు సెట్‌లోనే వాంతులు చేసుకునేంత..దారుణంగా సీన్స్ తెరకెక్కించాడు. వారిలో కొందరు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లారు. అంతే కాదండోయ్..ఇందులో చూపించిన రేప్ సీన్స్ కి..నిజంగా బయట తన గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసిన వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా రిలీజైన 10 రోజుల్లోనే 50 కంటే ఎక్కువ దేశాల్లో బ్యాన్ చేశారు. 

అయితే ఇది విడుదలైన ప్రతిచోట భారీ బాక్సాపీస్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ నరమాంస హోలోకాస్ట్ మూవీని 1 లక్ష డాలర్ల బడ్జెట్‌తో తెరెకెక్కించగా..రిలీజైన కేవలం 10 రోజుల్లో 20 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంతేకాదు..సినిమా బడ్జెట్ కంటే 2000 రెట్లు వసూలు చేసి కల్ట్ క్లాసిక్ హోదా పొందిన చిత్రంగా నిలిచింది. ఇక ప్రతి దేశంలో రిలీజై ఉంటే..ఇంకెన్ని కోట్లు సాధించేదో అర్ధం అయ్యే ఉంటుంది.