ఈ వెబ్ ‌‌ సిరీస్​ చూడాల్సిందే..

ఈ వెబ్ ‌‌ సిరీస్​ చూడాల్సిందే..

ఆమె చేసిన తప్పేంటి? 

టైటిల్ ‌‌: ఎక్స్​పోజ్​డ్ 24 (వెబ్ సిరీస్)
కాస్ట్ ‌‌: చెన్నమనేని వాసుదేవరావు, హర్షిత, శిరీష నూలు, ఆర్జే కాజల్, కరుణ భూషణ్, భావన, మేఘన ఖుషి
లాంగ్వేజ్:  తెలుగు, ఫ్లాట్ ‌‌ఫాం: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , రన్ ‌‌టైం: ఒక్కో ఎపిసోడ్ ‌‌ 23 నిమిషాల నుంచి 31 నిమిషాలు 
డైరెక్షన్ ‌‌: విజయ్ కృష్ణ

గ్రీష్మ (హర్షిత), ఆకాష్ (చెన్నమనేని వాసుదేవ రావు) భార్యాభర్తలు. ఇద్దరూ ‘ఎక్స్​పోజ్​డ్​ 24’ అనే ఛానెల్​లో యాంకర్స్​గా పనిచేస్తుంటారు. ఛానెల్​లో అందరూ గ్రీష్మకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. దాంతో ఆకాశ్​కు​ కూడా కొన్నిసార్లు ఆమె మీద అసూయ పుడుతుంది. ఛానెల్​ సీఈవో కూడా ఆమెకు చాలా ఇంపార్టెన్స్​ ఇస్తుంటాడు. అదే టైంలో ఛానెల్​లో పనిచేస్తున్న ఓ యాంకర్​ రిజైన్​ చేయడంతో మరో అమ్మాయి వర్ష (శిరీష నూలు) ఆ ప్లేస్ ‌‌లో చేరుతుంది. అప్పటినుంచి ఆమె ఆకాశ్​కు బాగా దగ్గరవుతుంది. అది చూసిన గ్రీష్మ తట్టుకోలేకపోతుంది. ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే.. వర్ష ఆ ఛానెల్​లో గ్రీష్మ మీద పగ తీర్చుకునేందుకే చేరుతుంది. ఇంతకీ వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? గ్రీష్మ వల్ల వర్షకు కలిగిన నష్టమేంటి? తెలుసుకోవాలంటే ఈ వెబ్ ‌‌ సిరీస్​ చూడాలి.

పాపులర్​ యాంకర్ గ్రీష్మ రోల్ ‌‌లో హర్షిత ఒదిగిపోయింది. వాసుదేవ రావు, శిరీష నూలు కూడా బాగా నటించారు. కథలో ట్విస్ట్ ‌‌లు బాగుంటాయి. ఇప్పటివరకు విడుదలైన ఎపిసోడ్స్​తో పాటు మరికొన్ని రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. ​ డైరెక్టర్ ‌‌ ‌‌ కె.రాఘవేంద్ర​రావు సమర్పణలో ఈ సిరీస్ రావడంతో కాస్త ఎక్కువ హైప్ ‌‌ క్రియేట్ ‌‌ అయింది. 

అనుకోకుండా ఒక రాత్రి 

టైటిల్ ‌‌: ఈషో, కాస్ట్ ‌‌: జయసూర్య, నమిత ప్రమోద్, జాఫర్ ఇడుక్కి, జానీ ఆంటోని, ఇంద్రన్స్, సురేష్ కృష్ణ, కొట్టాయం నజీర్, అక్షర కిషోర్
లాంగ్వేజ్: మలయాళం, ఫ్లాట్ ‌‌ఫాం: సోనీ లివ్,‌‌ రన్ ‌‌టైం: 107 నిమిషాలు
డైరెక్షన్ ‌‌: నాదిర్షా

ఈ సినిమాలో ఎక్కువ భాగం ఒక రాత్రిలోనే జరిగినట్టు చూపిస్తారు. ఒక ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పిళ్లై (జాఫర్ ఇడుక్కి) ఒక చైల్డ్​ హెరాస్​మెంట్​ కేసులో సాక్ష్యం చెప్పడానికి రెడీ అవుతాడు. కానీ.. అతను సాక్ష్యం చెప్తే బాగా డబ్బున్న ఒక వ్యక్తికి శిక్ష పడుతుంది. అందుకే రాత్రికి రాత్రే పిళ్లైని చంపాలనుకుంటాడు. ఇదిలా ఉండగా ఒక రోజు రాత్రి ఏటీఎం దగ్గర నైట్ డ్యూటీ చేస్తున్న అతడి దగ్గరికి ఒక అపరిచితుడు (జయసూర్య) వస్తాడు. పిళ్లై అతన్ని చేరదీసి, రాత్రి అక్కడే ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అపరిచితుడు సెక్యూరిటీ గార్డుని ఏం చేశాడు? ఇంతకీ అతను కోర్టులో సాక్ష్యం చెప్పాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

స్క్రీన్​ ప్లే బాగుంది. చివరి వరకు సస్పెన్స్​ మెయింటెయిన్​ చేశారు. కథకు సరిపడా ట్విస్ట్​లు కూడా ఉన్నాయి. జయసూర్య యాక్టింగ్​ చాలా బాగుంది. సెక్యూరిటీ గార్డుగా నటించిన జాఫర్ ‌‌ ‌‌ కూడా మెప్పించాడు. నమిత ప్రమోద్ జూనియర్ లాయర్​గా బాగా నటించింది. 

రూమర్ ‌‌ ‌‌

టైటిల్ ‌‌: మజా మా, కాస్ట్ ‌‌: మాధురీ దీక్షిత్​, గజ్​రాజ్ రావు, రజిత్ కపూర్​, షీబా ఛద్దా, రిత్విక్ భౌమిక్, బర్ఖా సింగ్​, లాంగ్వేజ్:  హిందీ
ఫ్లాట్ ‌‌ఫాం: అమెజాన్ ‌‌ ప్రైమ్ ‌‌ వీడియో, రన్ ‌‌టైం: 134 నిమిషాలు
డైరెక్షన్ ‌‌: ఆనంద్ ‌‌ తివారీ

పల్లవి పటేల్ (మాధురీ దీక్షిత్) మంచి డాన్సర్​. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు తేజస్. అమెరికాలో జాబ్​ చేస్తుంటాడు. అక్కడే ఒక పంజాబీ ఎన్​ఆర్​ఐ అమ్మాయి ఈషా(బర్ఖా సింగ్)ని ప్రేమిస్తాడు. ఆమె తల్లిదండ్రులు పామ్, బాబ్ (షీబా చద్దా, రజిత్ కపూర్) కూడా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు. వీళ్ల పెండ్లి విషయం మాట్లాడేందుకు పల్లవి, ఆమె భర్త మనోహర్ (గజరాజ్ రావు)ని కలవాలి అనుకుంటారు. సరిగ్గా అదే టైంలో పల్లవి గురించి ఒక పుకారు వ్యాపిస్తుంది. ఆ పుకారు వాళ్లింట్లో అందరిపై ఎఫెక్ట్​ చూపిస్తుంది. ఇంతకీ అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఫ్యామిలీ డ్రామాలో అండర్ ‌‌ ‌‌లైన్ ‌‌గా సోషల్ ‌‌ ఇష్యూని టచ్ ‌‌ చేశారు. మాధురీ దీక్షిత్​ యాక్టింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే తల్లిగా  బెస్ట్​ ఫర్ఫార్మెన్స్ ‌‌​ ఇచ్చింది. సినిమాలో ఎమోషన్స్​తో పాటు కామెడీ కూడా హైలైట్​. ముఖ్యంగా  డైలాగ్​లు బాగున్నాయి. గజరాజ్ రావు కూడా మనోహర్ ‌‌గా బాగా నటించాడు.