
వదిలించుకుందాం అనుకుంటే..
టైటిల్ : కాళీధర్ లాపాట, ప్లాట్ ఫాం: జీ5 (జూలై 4నుంచి స్ట్రీమింగ్)
డైరెక్షన్ : మధుమిత, కాస్ట్ : అభిషేక్ బచ్చన్, దైవిక్ బఘేలా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్
మధ్య వయస్కుడైన కాళిధర్ (అభిషేక్ బచ్చన్) జ్ఞాపకశక్తి కోల్పోయి ఇబ్బందిపడుతుంటాడు. అతనికి ట్రీట్‌మెంట్ చేయించడానికి చాలా ఖర్చు అవుతుందని చెప్తారు డాక్టర్లు. తన తమ్ముళ్లు అతన్ని భారంగా భావించి ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేస్తారు. అతన్ని కుంభమేళాకు తీసుకెళ్లి ఒకచోట వదిలేసి గుడారానికి వెళ్లిపోతారు. తన పేరు, అడ్రస్ కూడా మర్చిపోయిన కాళిధర్ ఎలాగోలా గుడారానికి తిరిగి వెళ్తాడు. లోపల తన తమ్ముళ్లు మాట్లాడుకుంటున్న మాటలను బయటినుంచే వింటాడు. అతన్ని తన తమ్ముళ్లు వదిలించుకోవాలి అనుకుంటున్నారని తెలుసుకుని చాలా బాధ పడతాడు. వాళ్లకు భారం కాకూడదని కనిపించిన బస్ ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోతాడు.
అలా ఒక గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడి ఆలయంలో పడుకుంటాడు. అక్కడే ఎనిమిదేళ్ల అనాథ బాలుడు బల్లు (దైవిక్ బఘేల)ని కలుస్తాడు కాళిధర్. మొదట్లో బల్లు అతన్ని ఇబ్బంది పెడతాడు. కానీ.. తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంతలో కాళిధర్ తమ్ముళ్లు అప్పుల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? కాళిధర్ తిరిగి తన సొంతూరికి వెళ్లాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
తప్పు చేశాడా?
టైటిల్ : గుడ్ వైఫ్
ప్లాట్ ఫాం : జియోహాట్‌స్టార్ (జూలై 4నుంచి స్ట్రీమింగ్)
డైరెక్షన్ : రేవతి
కాస్ట్ : ప్రియమణి, సంపత్ రాజ్
ఇది ఒక కోర్టు రూమ్ డ్రామా. అమెరికన్ సిరీస్ ‘గుడ్ వైఫ్’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గుణ శీలన్ (సంపత్ రాజ్) భార్య తరుణిక(ప్రియమణి).. వాళ్లకు ఇద్దరు పిల్లలు. వాళ్లది పదహారేండ్ల అన్యోన్య దాంపత్యం. వాళ్లని చూసినవాళ్లు భార్యభర్తలంటే ఇలాగే ఉండాలి అనుకునేవాళ్లు. అలాంటి వాళ్ల జీవితాన్ని ఒక సంఘటన పూర్తిగా మార్చేస్తుంది.
►ALSO READ | Korian Kanakaraj: ‘కొరియన్ కనకరాజు’ అప్డేట్.. ఈతూరి వరుణ్ తేజ్ హిట్ కొట్టేనా?
గుణకు సంబంధించిన ఒక అశ్లీల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. దాంతో సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని అతను జైలుకు వెళ్తాడు. అప్పటినుంచి తరుణిక అతన్ని అసహ్యించుకుంటుంది. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ సాయంతో ఎల్‌ఏహెచ్ అనే ‘లా’ సంస్థలో అసోసియేట్ అడ్వకేట్‌గా చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుణ నిజంగానే తప్పు చేశాడా? అతని కోసం తరుణిక ఏం చేసింది? అనేది మిగతా కథ.
తప్పించుకుందాం అనుకుని!
టైటిల్ : AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్, (జూలై 3నుంచి స్ట్రీమింగ్)
డైరెక్షన్ : జోసెఫ్ క్లింటన్,
కాస్ట్ : హర్ష్ రోషన్, భానుప్రకాష్, జయతీర్థ, అక్షర, హర్ష చెముడు, చైతన్య రావు, జీవన్ కుమార్, సందీప్ రాజ్, సునీల్
అర్జున్ (హర్ష్ రోషన్), ఇమ్రాన్ (భానుప్రకాష్), రాజు (జయతీర్థ) అప్పుడే టెన్త్ పాసయ్యారు. ముగ్గురూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవాళ్లు. ముగ్గుర్నీ వాళ్ల పేరెంట్స్ విజయవాడలోని ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ కాలేజీలో ఐఐటీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్‌లో చేర్పిస్తారు. కానీ, వాళ్లు కాలేజీలో చేరిన వెంటనే అక్కడి పరిస్థితుల్లో చదవడం చాలా కష్టమని డిసైడ్ అవుతారు. అందుకే వీలైనంత తొందరగా అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీ నుంచి తప్పించుకున్నారా? లేదా? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాలి.
#Weekendsuggition
— Movie Club 🎬 (@Movieclub999) July 6, 2025
Its a good watch ✨
Comedy + Reality + Parents POV
Streaming on ETV WIN #AIR pic.twitter.com/4PYdu7B7uR