Korian Kanakaraj: ‘కొరియన్‌‌‌‌ కనకరాజు’ అప్డేట్.. ఈతూరి వరుణ్ తేజ్ హిట్ కొట్టేనా?

Korian Kanakaraj: ‘కొరియన్‌‌‌‌ కనకరాజు’ అప్డేట్.. ఈతూరి వరుణ్ తేజ్ హిట్ కొట్టేనా?

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్ తర్వాత ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్  జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌‌‌‌లో వరుణ్ తేజ్‌‌‌‌తో పాటు కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నారు. మోస్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెన్స్‌‌‌‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌తో ఎనభై శాతం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌‌‌‌ అనౌన్స్‌‌‌‌ చేయడంతోపాటు మూవీ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

ఇండో కొరియన్‌‌‌‌ హారర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘కొరియన్‌‌‌‌ కనకరాజు’అనే టైటిల్‌‌‌‌ను  పరిశీలిస్తున్నారు.  వరుణ్ తేజ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 15వ సినిమా కాగా, రితికా నాయక్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు.

►ALSO READ | Meetha Raghunath: పెండ్లి చేసుకుని ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ.. ఎవరీ మీతా రఘునాథ్?

వరుణ్ తేజ్ మూవీస్:

వరుణ్ తేజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ను ఎంచుకుంటూ వస్తున్నాడు. కానీ, విజయానికి చాలా దూరంలో ఉంటున్నాడు. గత నాలుగు సినిమాలు గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, ఇటీవల మట్కా.. ఇవన్నీ వరుణ్కు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్ట్స్ చేసిన సరైన హిట్ ఒక్కటే అంటే ఒక్కటి ఇవ్వలేదు. దానికితోడు నిర్మాతలకు కోట్లలలో నష్టాలూ తీసుకొచ్చాయి. మరి ఈ సారైనా వరుణ్ హిట్ కొడుతాడో లేదో చూడాలి.