ఈ వారం (మే 14 & 15) థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో ఒక భారీ తమిళ చిత్రం ఉండగా, మరో హిందీ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగులో కూడా దాదాపు ఐదు డైరెక్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, ఈ తెలుగు చిత్రాలకు ఇప్పటివరకు పెద్దగా ప్రచారం లేకపోవడం మైనస్‌గా మారింది. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్స్ పరంగా చూస్తే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌లో ఆసక్తిని పెంచుతోంది.
‘కరుప్పు’..
సూర్య హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కరుప్పు’. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో మే 14న థియేటర్లోకి వస్తుంది. కోర్ట్ రూమ్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ అలరించనుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ తమిళ ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. జై భీమ్' తర్వాత మరోసారి లాయర్ గా నటిస్తున్నారు సూర్య. త్రిష కూడా లాయర్ రోల్ చేశారు. దర్శకుడు ఆర్.జె. బాలాజీ కూడా లాయరే. కానీ, ఇందులో విలన్ రోల్ చేశారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి.
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’..
త్రిగుణ్, పాపం ప్రతాప్ హీరోయిన్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని డైరెక్ట్ చేశాడు. ఇది ఫుల్ ఫన్‌ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. శుక్రవారం మే 15న విడుదలవుతోంది. టీజర్, ప్రమోషన్స్ సినిమాపై క్యూరియాసిటీ తీసుకొచ్చింది.
‘పతి పత్నీ ఔర్ వో దో’..
ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, వామికా గబ్బీ ప్రధాన పాత్రధారులుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పతి పత్నీ ఔర్ వో దో’. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేశాడు. అటవీశాఖలో సీనియర్ అధికారి అయిన ప్రజాపతి జీవితంలో వచ్చిన సమస్యలేంటి? ముగ్గురు అమ్మాయిలతో ముడిపడిన ఆ రహస్యం ఏంటి? అనేది సినిమాలో ఆసక్తికర పాయింట్. దర్శకత్వం వహించారు. మే 15న థియేటర్లలోకి రానుంది.
►ALSO READ | Ashu Reddy: నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇక లేడు.. హీరో మృతిపై అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్
వీటితో పాటుగా ‘అరేయ్ ఆపండ్రా’, ‘హరుడు’, ‘శివం శైవం’ వంటి చిత్రాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఇవి ఇంకా సాధారణ ప్రేక్షకులకు పెద్దగా చేరువ కాలేకపోయాయి. కంటెంట్ పరంగా కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఈ చిత్రాలు రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన తెచ్చుకుంటాయో చూడాలి.
మొత్తానికి, ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి ఎక్కువగా కనిపించనుంది. మంచి కథ, పాజిటివ్ టాక్ ఉంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్స్ కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
