
డ్రెస్‌కి మ్యాచింగ్ జువెలరీ, యాక్సెసరీస్ వేసుకోవడం కామనే. కానీ, ఇప్పుడు మ్యాచింగ్ మాస్క్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇంకాస్త ముందడుగేసి కొందరు బంగారు నగలతో డెకరేట్ చేసిన మాస్క్‌లు వేసుకుంటున్నారు. అచ్చం ఈ ఫొటోలో ఉన్నామెలాగా. ప్యాండెమిక్లో చుట్టాల ఇంట్లో పెళ్లి..మాస్క్ లేకుంటే ఎట్లా? కానీ, మాస్క్ పెట్టుకుంటే తన బంగారు ముక్కుపుడక కనిపించదు. దాంతో కాస్త క్రియేటివ్‌గా ఆలోచించింది ఈమె. ఇలా మాస్క్ మీద నుంచి ముక్కుపుడక పెట్టుకుంది. ఈ ఫొటోని ఐపీఎస్ ఆఫీసర్ దిపాన్షు కాబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దాంతో ఈ మహిళ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.