
ఆవలించడం అనేది సహజ ప్రక్రియ.. ఎక్కువుగా ఆవలించామంటే అలపోవడమో.. విసుగ్గా ఉండడమో.. పని ఒత్తిడి ఎక్కువఅయినప్పుడు ఇలాంటి సమయాల్లో అధికంగా ఆవలింతలు వస్తాయి. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎదుటివారు ఆవలిస్తుంటే మనకు కూడా ఆవలింతలు వస్తాయి. ఇది ఒక సహజమైన శారీరక చర్య. కానీ, ఒక్కోసారి ఎక్కువగా ఆవలింతలు రావడం వెనుక కొన్ని రకాల వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఏఏ వ్యాధుల వల్ల ఎక్కువుగా ఆవలింతలు వస్తాయో తెలుసుకుందాం. . .
ఎక్కువుగా ఆవలింతలు వచ్చే విషయంలో స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. కొంతమంది రోజుకు
స్లీప్ ఫౌండేషన్ సమాచారం ప్రకారం, కొంతమంది రోజుకు 10 సార్లు కూడా ఆవలిస్తారు. మరి కొంతమంది 100 సార్లు కూడా ఆవలిస్తారు. ఇంకొంతమంది 5 నిమిషాల్లో 3 నుంచి -4 సార్లు ఆవలిస్తారు. దీని కంటే ఆరోగ్య పరంగా ఇబ్బందులున్నాయని స్లీప్ పౌండేషన్ నివేదిక ద్వారా తెలుస్తుంది.
అధికంగా ఆవలించడానికి కారణం
- నిద్ర లేకపోవడం
- శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం
- మందుల ప్రభావం
- బోర్ గా ఉన్నప్పుడు
ఇవిఆవలింతకు ప్రధాన కారణాలు. దీనితో పాటు, ఆవలింతకు మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
గుండె జబ్బులు:గుండెపోటు వలన కూడా ఆవలింతలు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది. హార్ట్ ఎటాక్ కి గురయినవారిలో శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో ఆవలింతలు రావచ్చు. అయితే గుండె పోటు వచ్చినప్పుడు ఇతర లక్షణాలు సైతం చాలా ఉంటాయి కనుక… ఆవలింతలు రాగానే హార్ట్ ఎటాక్ కావచ్చని భయపడిపోనక్కర్లేదు. .
డయాబెటిస్: ఆవలించడం హైపోగ్లైసీమియా ప్రారంభ సంకేతంగా భావించవచ్చు. ఎక్కువగా ఆవలిస్తే శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ లో మార్పు వస్తాయి. అధికంగా ఆవలింతలు వచ్చాయంటే షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
నిద్రలేమి సమస్యలు:చాలా తరచుగా ఆవలింతలు వస్తుంటే అది నిద్రలేమికి సూచన కావచ్చు. సాధారణంగా ఏదైనా శారీరక మానసిక సమస్య ఉన్నపుడు మనం నిద్ర లేమి లేదా స్లీప్ అప్నియాకు గురవుతుంటాం. కనుక ఆవలింతలు తరచుగా వస్తుంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. స్లీప్ ఆప్నియా అనేది చాలా తీవ్రమైన స్లీప్ డిజార్డర్. దీనికి గురయిన వారు నిద్రలో గురక పెడతారు. దాంతో శ్వాస పదేపదే ఆగిపోయి తిరిగి మొదలవుతుంటుంది. చాలా ఎక్కువ గురక పెట్టటమే కాకుండా, రాత్రంతా నిద్రపోయినా తెల్లవారి అలసిపోయినట్టుగా ఉంటే స్లీప్ అప్నియా ఉన్నదని అనుమానించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.