ఈ ఏడాది టార్గెట్​...5,6 లక్షల మంది టూరిస్టులు : మలేషియా

 ఈ ఏడాది టార్గెట్​...5,6 లక్షల మంది టూరిస్టులు : మలేషియా
  • ప్రకటించిన మలేషియా టూరిజం బోర్డు

హైదరాబాద్​, వెలుగు: ఈ ఏడాది ఇండియా నుంచి తమ దేశానికి 5-6 లక్షల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డు తెలిపింది.  కనీసం 15 కోట్ల మంది గ్లోబల్ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌లను ఆకర్షించాలని టార్గెట్​గా పెట్టుకున్నామని వెల్లడించింది. హైదరాబాద్​ నుంచి వారానికి 15 విమానాలు మలేషియాకు వెళ్తున్నాయని తెలిపింది. “భారత్,  మలేషియా మధ్య ఎయిర్ కనెక్టివిటీ చాలా బాగుంది. 2024 నాటికి భారతదేశం నుంచి టూరిస్టుల సంఖ్యను కరోనా పూర్వస్థాయికి  తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం.

ఇందుకోసం మా దేశంలో ఎన్నో టూరిస్ట్​ ప్రాజెక్టులను డెవెలప్​ చేస్తున్నాం. కొన్ని షరతులతో ‘వీసా అన్​ అరైవల్​’ సదుపాయం కల్పిస్తున్నాం”అని మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డ్‌‌‌‌లో ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ ఆసియా/ఆఫ్రికా సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అమిరుల్ రిజాల్ అబ్దుల్ రహీమ్ అన్నారు. హైదరాబాద్​లో శుక్రవారం నిర్వహించిన రోడ్​షోలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2019లో  భారతదేశం నుంచి 7.35 లక్షల మంది తమ దేశం వచ్చారని, 2024లో ఈ సంఖ్యను మరింత పెంచాలని అనుకుంటున్నామని వివరించారు.