ఏకాదశి సందర్భంగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ఏకాదశి సందర్భంగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత జిల్లాల ప్రజలు నదిలో స్నానాలు చేసి.. ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, కోటి లింగాల ఆలయాల్లో జూన్​ 29న భక్తుల రద్దీ నెలకొంది.  

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా.. కాళేశ్వరంలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పెద్దపల్లి జిల్లా మంథని శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు విశేషంగా తరలివచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అఖండ భజన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.