V6 News

థామస్ కప్ ఫైనల్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌:‌ ఫైనల్లో ఇండియా

థామస్ కప్ ఫైనల్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌:‌ ఫైనల్లో ఇండియా

హార్సెన్స్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌): ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా మెన్స్ టీమ్ వరుసగా రెండో విక్టరీతో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. సోమవారం జరిగిన గ్రూప్–-ఎ మ్యాచ్‌‌‌‌లో 5-0తో ఆస్ట్రేలియాను వైట్‌‌‌‌వాష్‌‌‌‌ చేసి నాకౌట్ బెర్తు సొంతం చేసుకుంది. ఫస్ట్ సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్ 21-14, 21–-16తో  స్టీఫెన్ సామ్‌‌‌‌పై గెలిచి జట్టుకు శుభారంభం అందించాడు.

ఆపై, ఆయుష్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్‌‌‌‌ను చిత్తు చేయగా.. తొలి డబుల్స్‌‌‌‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-14, 21-16తో రిజ్కీ హిదాయత్-జాక్ యూ జంటను ఓడించి జట్టు విజయాన్ని ఖాయం చేసింది.

మూడో సింగిల్స్‌‌‌‌లో  ప్రణయ్ 21-11, 21-17తో  రిషి హోండాను, రెండో డబుల్స్‌‌‌‌లో హరిహరన్–అర్జున్ 21-12, 21-10తో  రామదన్స్య-సామ్‌‌‌‌ను ఓడించడంతో ఇండియా క్లీన్‌‌‌‌స్వీప్ చేసింది. గ్రూప్ టాపర్‌‌‌‌ను నిర్ణయించే ఆఖరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో బుధవారం చైనా జట్టుతో ఇండియా తలపడనుంది.