ఆర్టీసీలో యూనియన్లు పెట్టుకోవచ్చు

ఆర్టీసీలో యూనియన్లు పెట్టుకోవచ్చు

 సీఎం అనుమతిచ్చారన్న టీఎంయూ అధ్యక్షుడు


ఆర్టీసీలో యూనియన్లను ఏర్పాటు చేసుకునేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) అధ్యక్షుడు థామస్ రెడ్డి చెప్పారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కాలపరిమితి పూర్తయిందని, సీఎం యూనియన్లు ఏర్పాటు చేసుకోవాలని సంకేతాలిచ్చారని చెప్పారు. తమదే అసలైన టీఎంయూ అని, అశ్వత్థామరెడ్డి వైఖరితో కార్మికులు నష్టపోయారని ఆరోపించారు. ఆయనను ఫోరంలో నిలదీస్తామని హెచ్చరించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వంతో కిలసి ముందుకెళ్తేనే ఆర్టీసీని, కార్మికులను కాపాడుకున్నవాళ్లం అవుతామని అన్నారు.