నేటి నుంచి టీకాకెళ్తే కోడ్ చెప్పాలె

 నేటి నుంచి టీకాకెళ్తే కోడ్ చెప్పాలె

న్యూఢిల్లీ: కొవిన్​లో రిజిస్టర్ చేసుకుని టీకాకు వెళ్తున్నారా.. అయితే మీరు నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే, వ్యాక్సినేషన్ స్టేటస్​కు సంబంధించి డేటా ఎంట్రీలో తప్పులకు చెక్ పెట్టేందుకు కొవిన్ సిస్టమ్ లో ఈ కొత్త ఆప్షన్ శనివారం నుంచి అమలులోకి రానుందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ  వెల్లడించింది. స్లాట్ బుక్ చేసుకున్నవాళ్లు వ్యాక్సినేషన్​కు వెళ్లకపోయినా.. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఎస్ఎంఎస్​లు వస్తున్నాయి. డేటా ఎంట్రీలో ఎర్రర్ వల్ల ఈ సమస్య వస్తోందని, అందుకే సెక్యూరిటీ కోడ్ ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ సెంటర్​లో వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే, లబ్ధిదారులు నాలుగు అంకెల కోడ్​ను చూపించాలి. అప్పుడే వ్యాక్సిన్ వేస్తారు. 

ఆన్​లైన్​లో స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ కొత్త రూల్ వర్తిస్తుందని పేర్కొంది. అపాయింట్​మెంట్ బుక్ చేయగానే సెక్యూరిటీ కోడ్ ఎస్ఎంఎస్ వస్తుంది. అక్నాలెడ్జ్​మెంట్ స్లిప్​లోనూ ఈ కోడ్ ఉంటుందని, అయితే అది వ్యాక్సినేటర్ కు తెలిసే అవకాశంలేదని చెప్పింది. లబ్ధిదారులు సెక్యూరిటీ కోడ్​ను వ్యాక్సినేటర్ కు చెబితే.. వ్యాక్సినేషన్ రికార్డ్ అప్ డేట్ అవుతుందని, డిజిటల్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుందని వెల్లడించింది. ఎవరికైనా ఎస్ఎంఎస్ రాకుంటే వ్యాక్సినేటర్ లేదా వ్యాక్సినేషన్ సెంటర్ ఇన్​చార్జిని సంప్రదించాలని సూచించింది. టీకా కవరేజీని సులభతరం చేయడానికి, అది దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.