లింగంపేట, వెలుగు : మండలంలోని మెంగారం గ్రామానికి చెందిన తోట శ్రీవల్లి రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో సత్తా చాటింది. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రవిశ్రీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అలోక్ నేషనల్ ప్రీమియం అవార్డ్స్ సెవంత్ సెషన్లో శ్రీవల్లి ఉత్తమ ప్రతిభను కనబరిచింది. జబర్ధస్త్ ఫేం శేకింగ్ శేషు చేతులమీదుగా రాష్ట్రస్థాయి బెస్ట్ చైల్డ్క్లాసికల్ డ్యాన్సర్ అవార్డును అందుకున్నారు.
శ్రీవల్లి హైదరాబాద్లోని శ్రీకరి మహాసన హైస్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. శ్రీసాయి డ్యాన్స్ అకాడమీలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటోంది. శ్రీవల్లిని అలోక్ నేషనల్ ప్రీమియం అవార్డు నిర్వాహకుడు రవిశ్రీ, సాయిడ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు బూరుగు నళిని, డ్యాన్స్ మాస్టర్ లక్ష్మీసౌజన్య అభినందించారు. శ్రీవల్లి కూచిపూడి నృత్యంలో రెండోసారి అవార్డు అందుకున్నారు.
