కరోనా ఎఫెక్ట్.. బతికుండగానే వేలాది కోళ్ల పూడ్చివేత: వీడియో

కరోనా ఎఫెక్ట్.. బతికుండగానే వేలాది కోళ్ల పూడ్చివేత: వీడియో

కర్ణాటక: కరోనా భయంతో చైనాలో బతికుండగానే పందులను గుంతల్లో పూడ్చేసినట్లు.. ఇండియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే భయంతో కోళ్లు, కోడి పిల్లలను పూడ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల పాలవుతోంది. ఈ క్రమంలోనే చికెన్ రేట్లు అమాంతం పడిపోయాయి. పలుచోట్ల కేజీ చికెన్ రూ. 30కే దొరుకుతుంది. పోషణ ఖర్చు పెరగడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో కర్ణాటకలో వేలాది బాయిలర్ కోళ్లను సజీవంగా పూడ్చేశారు.

కర్ణాటకలోని బెళగావి సమీపంలో ఉన్న లోలసూర అనే గ్రామంలో ప్రొక్లెయినర్ తో ఓ భారీ గుంతను తవ్వించి 6 వేల 500 కోళ్లు, 9వేల 500 కోడి పిల్లలను అందులో పూడ్చేశారు. కరోనా వైరస్ కారణంగా చికెన్ రేట్లు భారీగా తగ్గడంతో ఓ కోళ్ల ఫారం యజమాని నజీర్ మకందర్.. వాటిని పెంచినా నష్టాలు తప్ప లాభం ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మరోవైపు చికెన్ తినడంవల్ల కరోనా రాదని ఎంతగా ప్రచారం చేసినా.. ప్రజలు మాత్రం కోడి మాంసానికి దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు చికెన్ షాపుల వ్యాపారులు.

See Also: తెలుగులోనూ కరోనా కాలర్ ట్యూన్

టీమిండియాలో ఆ ముగ్గురికి అగ్ని పరీక్షే..!

ప్రభాస్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

అమెజాన్ లో భారీ ఆఫర్ కొట్టేసిన అమ్మాయిలు