ట్విట్టర్ కిల్లర్.. 5 కోట్లు దాటిన థ్రెడ్స్ అకౌంట్లు

ట్విట్టర్ కిల్లర్.. 5 కోట్లు దాటిన థ్రెడ్స్ అకౌంట్లు

మెటా కొత్తగా తీసుకువచ్చిన థ్రెడ్స్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రారంభించిన నాలుగు గంటల్లోనే మిలియన్ సైనప్ లను అనుకోగా.. ఇప్పుడు 50 మిలియన్లకు అంటే 5 కోట్లకు చేరుకుంది. దీంతో ఇప్పుడు ఈ యాప్ ను అందరూ "ట్విట్టర్ కిల్లర్" అని పిలుస్తున్నారు.

జూలై 6 న యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం నుంచే రికార్డ్ క్రియేట్ సృష్టిస్తోంది. ఈ యాప్ భారత దేశంతో పాటు చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. కానీ యూరోపియన్ (EU)లోని యూజర్స్ కు మాత్రం ఈ సేవలు అందుబాటులో లేవు. బహుశా ఆ ప్రాంతంలోని కఠినమైన ప్రైవసీ రూల్స్ కారణంగా అయి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

థ్రెడ్‌ల యాప్ చైనాలోని యాప్ స్టోర్‌లో ఐదవ స్థానానికి చేరుకుంది. ఇక్కడ మెటాతో పాటు ఇతర యాప్‌లు ప్రస్తుతం బ్లాక్ చేయబడ్డాయి. థ్రెడ్స్ కూడా భవిష్యత్ లో అదే పరిస్థితిని ఎదుర్కొంటాయని పలువురు భావిస్తున్నారు .

గురువారం నాటికి, థ్రెడ్స్ యాప్ 95 మిలియన్లకు పైగా పోస్ట్‌లను కలిగి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం 190 మిలియన్ లైక్‌లను సంపాదించిందని ది వెర్జ్ నివేదించింది. ఈ క్రమంలో ఎలోన్ మస్క్ ట్విట్టర్.. మెటా థ్రెడ్స్ మధ్య గట్టి పోటీ అప్పుడే ప్రారంభమైనట్టు కనిపిస్తోందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.