ఉక్రెయిన్‌కు ముప్పు ముగిసిపోలేదు

ఉక్రెయిన్‌కు ముప్పు ముగిసిపోలేదు
  • అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరిక

ఉక్రెయిన్, రష్యా శాంతి చర్చల పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజీకి రష్యా సానుకూలత వ్యక్తం చేసిందన్న వార్తల నేపథ్యంలో మాట్లాడిన అమెరికా డిఫెన్స్ హెడ్ క్వార్టర్  పెంటగాన్  అధికారి ప్రతినిధి జాన్  కిర్బీ.. రష్యా సేనల నుంచి ఉక్రెయిన్‌కు ముప్పు ఇంకా ముగిసిపోలేదన్నారు.కీవ్, చెర్నిహైవ్ ప్రాంతాల్లో మిలిటరీ దాడులు తగ్గినప్పటికీ.. ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై భారీగా దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. రష్యా బలగాలను పక్కకు మళ్లిస్తోందని భావిస్తున్నామని, రాజధాని కీవ్‌కు కూడా ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అనుకోవడానికి లేదన్నారు. 

కాగా, ఓ వైపు శాంతి ఒప్పందం దిశగా ఇరు దేశాలు చర్చలు జరుపుతుండగానే మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్ సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడుల శబ్దాలు వినిపించినట్లు తెలిపారు స్థానికులు.  మైకోలీవ్  ప్రాంతంలో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 12 మంది చనిపోయినట్లు తెలిపాయి స్థానిక న్యూస్ ఏజెన్సీలు.

మరిన్ని వార్తల కోసం..

9 రోజుల్లో రూ.5.60 పెరిగిన పెట్రోల్

భారీగా పడిపోయిన విరాట్ బ్రాండ్ వాల్యూ

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ