ఫేక్​ పోలీసుల టోకరా

 ఫేక్​ పోలీసుల టోకరా
  • ఫేక్​ పోలీసుల టోకరా
  • వ్యాపారిని బెదిరించి రూ.50 వేలు వసూలు

పాలకుర్తి, వెలుగు : పోలీసులమని బెదిరించి ఓ వ్యాపారి నుంచి రూ. 50 వేలు కాజేసిన నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.  జనగామ ఏసీపీ శ్రీనివాస రావు వారిని ఆదివారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు.. భువనగిరి జిల్లా గాజుల రామారం గ్రామానికి చెందిన  ఓ పౌల్ట్రీ ఫారమ్​ ఓనర్​ ధారావత్​ సాయికిరణ్​ రేషన్​ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన యువకులు పడమటింటి నవీన్​, చుక్క యాకన్న, నామాల ఉదయ్​, జిలుకర సోమేశ్వర్​ వ్యాపారి సాయి కిరణ్​కు ఫోన్​ చేసి తమ వద్ద రేషన్​ బియ్యం ఉన్నాయని, అమ్ముతాం రమ్మంటూ ఫోన్​ చేశారు. దీంతో గత నెల 30న వ్యాపారి సాయికిరణ్​ లక్ష్మక్కపల్లి గ్రామానికి వచ్చాడు.

యువకులలో ఇద్దరు వ్యాపారితోనే ఉండి, వెహికిల్​లో రేషన్​ బియ్యం బస్తాలను లోడ్​ చేశారు. బియ్యం లోడుతో వెహికిల్​ కొంత దూరం వెళ్లగానే మరో ఇద్దరు యువకులు తాము పోలీసులమని చెప్పి ఆపారు. రూ.50 వేలు ఇవ్వాలని, లేకుంటే కేసు పెడతామని బెదిరించారు.  దీంతో సాయికిరణ్​ నిందితులు చెప్పిన రెండు నెంబర్లకు రూ.50 వేలు ఫోన్​ పే  చేశాడు.  అయినా కూడా బియ్యం లోడును లాక్కుని అతన్ని పంపించారు.  ఈవిషయంపై  బాధిత వ్యాపారి  పోలీసులను  ఆశ్రయించగా నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.