
పశ్చిమబెంగాల్‌లోని అసన్ సోల్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పెద్ద ఎత్తున మంటలు చెరరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల్లో రెండు వెహికిల్స్ పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రోడ్డు పైనుంచి రెండు వెహికిల్స్‌ను తొలగించి.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. కాగా.. ట్యాంకర్ అసన్ సోల్ నుంచి రాణిగంజ్ వెళ్తుండగా.. డీసీఎం మెడిసిన్స్ లోడుతో కలకత్తా నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.