నేడు 3 ఐపీఓలు ఓపెన్‌‌

నేడు 3 ఐపీఓలు ఓపెన్‌‌

న్యూఢిల్లీ: మూడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) బుధవారం ఓపెన్ కానున్నాయి. శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయి. రాశి పెరిఫరల్స్‌‌, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌‌, క్యాపిటల్‌‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఈ కంపెనీలు రూ.1,700 కోట్లను సేకరించనున్నాయి. వీటికి తోడు ఎంటెరో హెల్త్‌‌కేర్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల 9 న (శుక్రవారం) ఓపెన్ అవుతుంది.

మరోవైపు  ‘ది పార్క్‌‌’ బ్రాండ్‌‌తో  హోటల్స్ నడుపుతున్న అపీజయ్‌‌ సురేంద్ర పార్క్‌‌ ఐపీఓ సబ్‌‌స్క్రిప్షన్‌‌ కోసం  ప్రస్తుతం ఓపెన్‌‌లో ఉంది. కిందటి నెల ఐదు కంపెనీలు ఐపీఓకి వచ్చి రూ. 3,266 కోట్లు సేకరించాయి. ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ) బుల్లిష్‌‌గా ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల కారణంగా కంపెనీలు ఫండ్స్‌‌ సేకరించుకోగలుతున్నాయని అన్నారు. ‘ఈ ఏడాది ఐపీఓ మార్కెట్‌‌ బాగుంటుందని అంచనా వేస్తున్నాం.

ఇండియన్ మార్కెట్లపై డొమెస్టిక్, ఫారిన్ ఇన్వెస్టర్లకు  నమ్మకం పెరిగింది. ఎలక్షన్స్ పూర్తయితే విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల ఇన్‌‌ఫ్లోస్‌ పెరుగుతాయి’ అని జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్‌‌  నేహా అగర్వాల్‌‌ పేర్కొన్నారు.  రాశి పెరిఫరల్స్‌‌ షేర్లు రూ.295–311 ప్రైస్‌‌ బ్యాండ్‌‌లో,  క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు రూ.445–468 రేంజ్‌‌లో, జన స్మాల్‌‌ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు రూ. 393–414 రేంజ్‌‌లో  అందుబాటులో ఉంటాయి.

Also read :మార్కెట్‌‌లోకి హెచ్‌‌పీ స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌ 360