కామారెడ్డి జిల్లాలో హోం గార్డులకు సేవా పతకాలు

కామారెడ్డి జిల్లాలో హోం గార్డులకు సేవా పతకాలు

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు హోం గార్డులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకాలు , అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైనట్లు  ఎప్పీ రాజేశ్​చంద్ర గురువారం తెలిపారు.  ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు పతకాలకు ఎంపికయ్యారన్నారు. పిట్లం మండలంలో చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా హోం గార్డు మారుతి  ప్రాణాలు కాపాడారు.  కామారెడ్డిలో రైల్వే ట్రాక్​పై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా,  హోం గార్డు వసంత్​ ప్రాణాలు కాపాడారు.  మల్లికార్జున్ ఎస్​బీ విభాగంతో  ఉత్తమ సేవలు అందిస్తున్నారు.   

బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి కర్షక్​ బీఈడీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన 2వ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు సాధించారు.  గురువారం కర్షక్ బీఈడీ కాలేజీలో సన్మానించారు.  కాలేజీ సెక్రటరీ వి.విశ్వనాథం విద్యార్థులను సన్మానించారు.  డైరెక్టర్లు పుండరీకాచారి,  వీరయ్య, లక్ష్మయ్య, ప్రతాప్​రెడ్డి, జనార్దన్​రెడ్డి, పెంటయ్య,  ప్రిన్సిపాల్ డాక్టర్​ ఎస్​.కె. రషీద్​,  లెక్చరర్లు కిషన్​, బాలు, బీమాగౌడ్​,  మమత, తయ్యబు, బాబురావు 
తదితరులు పాల్గొన్నారు.