ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాగ్యనగర్ తండాలో బొడ్రాయి కుంట దగ్గర ఎదురెదురుగా వస్తోన్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు.
మండలంలోని గుట్ట కింది గుంపుకు చెందిన దంపతులు సూర్యానారాయణ, సుగుణ.. మరో బైక్ పై వెళ్తున్న వెంకటేశ్వర్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ లో పనిచేస్తోన్న రాజుకి గాయాలయ్యాయి.