అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు ఇండో అమెరికన్ స్టూడెంట్లు మృతి

అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు ఇండో అమెరికన్ స్టూడెంట్లు మృతి

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన యాక్సిడెంట్​లో ముగ్గురు భారత అమెరికన్ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వేగంగా వెళ్తున్న వీళ్ల కారు చెట్టును డీకొట్టి పల్టీ కొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులను అవసరాల శ్రియ, అన్వీ శర్మ, ఆర్యన్ జోషిగా గుర్తించారు. జార్జియా రాష్ట్రంలో ఈ నెల 14న జరిగిన ఈ ప్రమాదం గురించి పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు.

అతివేగంతోనే ప్రమాదం..

జార్జియా స్టేట్ యూనివర్సిటీ, ఆల్ఫారెట్టా హైస్కూల్​లో చదువుతున్న ఐదుగురు శ్రియ, అన్వీ శర్మ, ఆర్యన్ జోషి, సోమెపల్లి రిత్విక్, మహ్మద్ లియాకత్ ఈ నెల 14న కారులో బయల్దేరారు. ఆల్ఫారెట్టా దగ్గర్లో వీళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో ఆర్యన్ జోషి, శ్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అన్వీ శర్మ, మిగతా ఇద్దరికి తీవ్రగాయాలుకాగా పోలీసులు నార్త్​పుల్టన్ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో అన్వీ శర్మ ఆస్పత్రిలో కన్నుమూసింది. రిత్విక్, లియాకత్ ట్రీట్​మెంట్ పొందుతున్నారు. వీళ్లందరూ 18 ఏండ్ల వయసువాళ్లేనని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది లియాకత్ అని తెలిపారు. ఓవర్​స్పీడ్ కారణంగానే కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు.