ములుగు జిల్లాలో పేలిన మందుపాతర..ముగ్గురు జవాన్లు మృతి.!

ములుగు జిల్లాలో పేలిన మందుపాతర..ముగ్గురు జవాన్లు మృతి.!

ములుగు జిల్లా  వాజేడులో  మండలం కర్రెగుట్టలు సమీపంలో మందు పాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.  వెంకటాపురం మండలం వీరబద్రవరం అటవీ ప్రాంతంలో  మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  గాయపడిన వారిని బీజాపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. 

కర్రెగుట్ట కింది భాగంలో భారీగా ల్యాండ్ మైన్ లు అమర్చారు మావోయిస్టులు. ఇప్పటివరకు ల్యాండ్ మైన్ లు పేలి పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయి. తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో గత పదిహేను రోజులుగా  స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు జవాన్లు. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందు పాతర పేలినట్లు తెలుస్తోంది.