విభజన అంశాలపై.. నేడు త్రిమెన్​ కమిటీ భేటీ

విభజన అంశాలపై.. నేడు త్రిమెన్​ కమిటీ భేటీ

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్​లో ఉన్న విభజన సమస్యలపై శుక్రవారం కేంద్ర హోంశాఖ జాయింట్​ సెక్రటరీ నేతృత్వంలోని త్రిమెన్​ కమిటీ భేటీ కానుంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని విభజన అంశాలు, సమస్యలపై ఈ మీటింగ్​లో చర్చించనున్నారు.  ఎజెండాలో నాలుగు విభజన అంశాలను చేర్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న సంస్థలు, సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజనపై చర్చించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ ఫైనాన్స్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు, ఏపీ ఫైనాన్స్‌‌‌‌ సెక్రటరీ రావత్‌‌‌‌ సభ్యులుగా ఉన్నారు. 

సీఎంతో రామకృష్ణారావు భేటీ!
అప్పుల కోసం ఢిల్లీలో 3రోజులపాటు ఉన్న రామకృష్ణారావు గురువారం హైదరాబాద్​కు చేరుకున్నారు. నేరుగా ప్రగతి భవన్​కి వెళ్లి సీఎం కేసీఆర్​ను కలిసినట్లు తెలిసింది. అప్పులతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సమాచారం.