తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ముగ్గురు జడ్జీలు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ముగ్గురు జడ్జీలు
  • తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్వల్ భుయాన్
  • దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
  • గత నెల 17న సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర న్యాయశాఖ
  • ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ అమానుల్లా, జస్టిస్ రవినాథ్ తిల్హారీ 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ముగ్గురు కొత్త జడ్జీలు రానున్నారు. గత నెల 17వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర న్యాయశాఖ నోటిఫై చేయడంతో 15 మంది జడ్జీలను వివిధ రాష్ట్రాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ బాంబే హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు జడ్జి రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు జడ్జిగా పాట్నా హైకోర్టు నుంచి ఆషానుద్దీన్ అమానుల్లాను, అలాగే అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రవినాథ్ తిల్హారీని నియమించారు.