
- పరారీలో నలుగురు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈజీ మనీ కోసం కొందరు డ్రగ్స్, గంజాయి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్టాస్క్ఫోర్స్టీమ్ గురువారం సాయంత్రం ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. గుండ్లపోచంపల్లిలోని ఓ రూమ్లో ఏడుగురు యువకులు రెంటుకు ఉంటున్నారు.
వీరంతా ఈజీ మనీ కోసం డ్రగ్స్, గంజాయి అమ్మతున్నారు. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం తనిఖీలు చేశారు. 2.11 కిలోల గంజాయి, 0.68 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల హాష్ఆయిల్దొరికింది. షణ్ముఖ సాయి, జూపాక నందు, ఉమేశ్ చంద్ర అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అరుణ్ కుమార్, అజయ్, సన్నీ, మేకల శివరాం అనే నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ తిరుపతి యాదవ్ తెలిపారు. గ్రాము ఎండీఎంఏను రూ.6 వేలకు, హాష్ఆయిల్రూ.1,200కు 10 గ్రాముల గంజాయిని రూ.1,500కు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, డ్రగ్స్ విలువ రూ.2.60లక్షలు ఉంటుందన్నారు.