గిరిజన పల్లెలకు త్రీ ఫేజ్ కరెంటు

గిరిజన పల్లెలకు త్రీ ఫేజ్ కరెంటు

మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో గిరిజన పల్లెలకు 3 ఫేజ్ కరెంటు అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్​ అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాలన్నింటికీ విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పన, గిరివికాసం అమలుపై .. మంత్రి సంక్షేమ భవన్​లో శనివారం రివ్యూ చేశారు. రాష్ట్రంలో కరెంట్ సౌలత్ లేని గిరిజన పల్లెలకు 3 ఫేజ్ విద్యుత్ అందించడంపై ఇప్పటికే సర్వే చేసి 3,467 ఆవాసాలను గుర్తించామని, ఇందులో 2,795 గ్రామాలకు 3 ఫేజ్ విద్యుదీకరణ పూర్తయిందని అన్నారు. మిగిలిన 19 శాతం పల్లెల పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుదీకరణ జరగని గ్రామాలకు వెంటనే కరెంట్ సౌలత్ కల్పించాలన్నారు. లైన్లు వేయలేని గిరిజన పల్లెలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ, విద్యుత్​ శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కలిసి పనిచేయాలన్నారు.

 

మరిన్ని వార్తల కోసం:

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స్టార్ హీరో

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం