
పంజాబ్ రాష్ట్రంలోని మోహాలీలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించాయి. మరో ఏడుగురి వరకు బిల్డింగ్ కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. స్టేట్, సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్.. సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి.
పక్కనే ఉన్న ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుండగా.. పొక్లెయినర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బిల్డింగ్ గోడకు పొక్లెయినర్ తగిలి అది కూలిపోవడంతో.. బిల్డింగ్ కూడా కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు.