ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్

మంత్రులు కేటీఆర్, సబితా, ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వారు తొలుత జైనథ్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శించనున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగియగానే నగరంలోని ఐటీ కంపెనీకి వెళ్లి.. అక్కడి యాజమాన్యం, సిబ్బందితో మంత్రులు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేయనున్నారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా బీజేపీ, బీజేవైఎం నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.