మూడు ట్రాక్టర్లకు నిప్పు

మూడు ట్రాక్టర్లకు నిప్పు

కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దామర్ గిద్ద గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. దామర్ గిద్ద గ్రామానికి చెందిన వీరశెట్టి పండరి, పోలీస్ పాటిల్, హన్మంత్ రావు పాటిల్ కు చెందిన ట్రాక్టర్లను  గ్రామ శివారులోని చెరువులో మట్టిని తరలించడానికి వాడుతున్నారు. సాయంత్రం పని ముగియగానే  ట్రాక్టర్లను అక్కడే పెట్టి పోవడం వల్ల గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మూడు ట్రాక్టర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.