పుణ్య‌‌స్నానానికి వెళ్లి.. ముగ్గురు యువకులు మృతి

V6 Velugu Posted on Jul 01, 2020

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకాదశి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకుని… గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరి నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లిన కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఏకాదశి పండుగ సందర్భంగా గంగ స్నానానికి వెల్లిన యువకులు ప్ర‌మాద వ‌శాత్తు అందులో ప‌డి మ‌ర‌ణించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

Tagged jayashankar bhupalpally, tholi ekadashi, drown in Godavari River, holy bath, three youths

Latest Videos

Subscribe Now

More News