హసన్ నగర్ లో రౌడీ షీటర్ దారుణ హత్య

హసన్ నగర్ లో రౌడీ షీటర్ దారుణ హత్య

హైదరాబాద్ : హసన్ నగర్ లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హోటల్ ముందు రౌడీ షీటర్ బాబూఖాన్ ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. తీవ్రంగా గాయపడ్డ బాబూఖాన్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే వెంటనే బహదూర్ పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

బాబూఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాబూఖాన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా కేసు నమోదై ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే బాబూఖాన్ ను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించింది.