Asian Para Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా (Aichi-Nagoya) వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. ఈరోజు (2026, అక్టోబర్ 23, శుక్రవారం) భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 106 పతకాలకు (28 స్వర్ణాలు, 34 రజతాలు, 44 కాంస్యాలు) చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనలో ఇండియన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు స్వర్ణాలు, రజతాల వర్షం కురిపించారు.
తులసిమతి– మానసి జోడీకి గోల్డ్:
మహిళల డబుల్స్ SL3-SU5 విభాగంలో భారత స్టార్ షట్లర్లు తులసిమతి మురుగేశన్ (Thulasimathi Murugesan), మానసి జోషి (Manasi Joshi)ల జోడీ అద్భుతమైన ఫామ్‌తో బంగారు పతకాన్ని ముద్దాడింది
* చైనాపై ప్రతీకారం: ప్రపంచ ఛాంపియన్లైన చైనా జోడీ యాంగ్ క్సియోక్సియా, క్సియావో జుక్సియాన్‌లను 21-16, 21-13 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసి తులసిమతి-మానసి ద్వయం గోల్డ్ ని కైవసం చేసుకుంది. 2025 ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమికి పగ తీర్చుకున్నారు.
* మెడల్ అప్‌గ్రేడ్: గత ఎడిషన్‌లో రజతం సాధించిన ఈ జోడీ, ఈసారి స్వర్ణంతో మెరిసింది.
* తులసిమతి హ్యాట్రిక్ మెడల్స్: తులసిమతి ఒకే రోజు 1 స్వర్ణం, 2 రజతాలు (మిక్స్‌డ్ డబుల్స్‌లో నితీష్ కుమార్‌తో కలిపి, ఉమెన్స్ సింగిల్స్ SU5 విభాగంలో) సాధించి అరుదైన మైలురాయిని చేరుకుంది.
మెన్స్ సింగిల్స్‌లో నితీష్, నవీన్ స్వర్ణ ధమాకా:
* SL3 ఫైనల్ (నితీష్ vs ప్రమోద్): పురుషుల సింగిల్స్ SL3 ఆల్-ఇండియా ఫైనల్ హోరాహోరీగా సాగింది. పారాలింపిక్ ఛాంపియన్ నితీష్ కుమార్, మరో పారాలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్‌ను 21-18, 21-16 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సాధించగా, ప్రమోద్ భగత్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
* SL4 ఫైనల్: నవీన్ శివకుమార్ SL4 కేటగిరీ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫెర్డీ సెటియవాన్‌పై 21-9, 21-17తో గెలిచి రజతాన్ని పసిడిగా మారింది.
* నిత్య శ్రీకి రజతం: మహిళల సింగిల్స్ SH6 ఫైనల్లో నిత్య శ్రీ సుమతి శివమ్ చైనా ప్లేయర్ లి ఫెంగ్‌మెయ్ చేతిలో ఓడి రజత పతకాన్ని సాధించింది.
పారా బ్యాడ్మింటన్ కేటగిరీల క్లారిటీ:
* SL3: కాళ్ల వైకల్యం ఎక్కువగా ఉన్న క్రీడాకారులు (హాఫ్ కోర్టులో ఆడతారు).
* SL4: నడవడానికి, పరుగెత్తడానికి మెరుగైన బ్యాలెన్స్ ఉన్న కాళ్ల వైకల్యం గల క్రీడాకారులు.
* SU5: చేతుల వైకల్యం కలిగిన క్రీడాకారులు.
* SH6: పొట్టిగా (Short stature) ఉండే క్రీడాకారులు.
TAKING DOWN THE WORLD CHAMPIONS! 🥇🇮🇳 Heartiest congratulations to the stellar duo of Thulasimathi Murugesan and Manasi Joshi on clinching the Gold Medal in the Badminton Women’s Doubles SL3-SU5 at the Asian Para Games 2026. #Cheer4Bharat #AsianParaGames2026 https://t.co/9LK13VaitI
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 23, 2026
