నల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.48 లక్షలు

నల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.48 లక్షలు

కౌడిపల్లి, వెలుగు: మండల పరిధిలోని తునికి నల్ల పోచమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించగా ఆదాయం రూ.5.48 లక్షలు వచ్చిందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నగదును ఎండోమెంట్​ ఖాతాలో జమచేసి ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో జహీరాబాద్ ఆలయ ఈవో శివ రుద్రప్ప, తునికి ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి, సిబ్బంది రాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాములు, శ్రీకాంత్ రెడ్డి, పర్వతాలు పాల్గొన్నారు.

ALSO READ : రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహిస్తాం : మామిళ్ల  జ్యోతి