వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఈవో రమాదేవి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు సంస్కృత కాలేజీ విద్యార్థులు త్యాగరాజు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. సుప్రసిద్ధ కళాకారులు శాస్ర్తీయ, భక్తి, సంగీత, సోలో, హరికథ, నృత్యా, హరికథ, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
