అమెరికాలోనూ టిక్‌టాక్ కట్..!

అమెరికాలోనూ టిక్‌టాక్ కట్..!

త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌‌‌పై సంతకం
యూఎస్‌లో టిక్‌‌టాక్‌‌ను కొనాలనుకుంటోన్న మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్ : చైనాకు చెందిన టిక్‌‌టాక్ యాప్‌‌ను అమెరికాలో కూడా బ్యాన్ చేయనున్నట్టు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పాపులర్ మ్యూజిక్ వీడియో యాప్‌‌పై వస్తోన్న డేటా ఆందోళనలపై ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు చెప్పారు. టిక్‌‌టాక్ విషయానికొస్తే.. అమెరికా నుంచి తాము దీనిని నిషేధించాలనుకుంటున్నామని ప్రెసిడెంట్ రిపోర్ట‌ర్ల‌కు తెలిపారు. ఈ నిషేధం ఎప్పుడుంటుంది అని రిపోర్ట‌ర్లు అడిగిన ప్రశ్నకు, త్వరలోనే నిర్ణ‌యం వెల్లడిస్తామని చెప్పారు. యాప్‌‌ను బ్యాన్ చేసే అధికారం తనకు ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ కింద లేదా ఎగ్జిక్యూ టివ్ ఆర్డ‌ర్ ద్వారా ఈ నిర్ణ‌యం తీసుకోనున్నట్టు ట్రంప్ చెప్పారు.

ఈ డాక్యుమెంట్‌‌పై సంతకం కూడా పెట్టనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు బైట్ ‌‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌‌టాక్ యాప్‌‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొనాలని చూస్తోంది. బైట్ ‌‌డ్యాన్స్ నుంచి టిక్‌‌టాక్ అమెరికన్ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తన అడ్వర్‌‌టైజింగ్ ‌‌బిజినెస్‌‌లను మైక్రోసాఫ్ట్‌ పెంచుకోవాలనుకుంటోంది. టిక్‌‌టాక్ యాప్‌‌ను బ్యాన్ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణ‌యించిన క్రమంలో, మైక్రోసాఫ్ట్ ‌అక్విజిషన్ డీల్ చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ కామెంట్ చేయడానికి నిరాకరించింది. టిక్‌‌టాక్ అమెరికాలో ఈ ఏడాది వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకుంది. మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించినట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తమ ప్లాట్‌‌ఫామ్ ద్వారా వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని, 1 బిలియన్ డాలర్ల క్రియేటర్ ఫండ్‌‌ను ఏర్పాటు చేసినట్టు టిక్‌‌టాక్ ప్రతినిధి చెప్పారు.

టిక్‌‌టాక్ అమెరికన్ యూజర్ల డేటాను అమెరికాలోనే స్టోర్ చేస్తున్నామని, ఎంప్లాయీ యాక్సస్ కోసం కూడా కఠినమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు. అమెరికాలో టిక్‌‌టాక్ అతిపెద్ద ఇన్వెస్టర్ల‌లో ఒకటిగా ఉందన్నారు. యూజర్లప్రైవసీ, సేఫ్టీని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామనిపేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీలో చైనా పవర్‌‌ను తగ్గించాలని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూడా యూజర్ల డేటా ప్రమాదంలో పడుతుందని టిక్‌‌టాక్ యాప్‌‌ను నిషేధించింది.  ప్రపంచంలోమోస్ట్ పాపులర్ యాప్స్‌‌లో ఒకటిగా టిక్‌‌టాక్ ఉంది. గ్లోబల్‌‌గా టిక్‌‌టాక్‌‌కు 2బిలియన్ టైమ్స్ కంటే ఎక్కువగా డౌన్‌‌లోడ్స్ నమోదయ్యాయి. అమెరికాలోనే 165 మిలియన్ టైమ్స్ పైగా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..