టిల్లన్న ఎలాగన్న.. పోరి దెబ్బకి మళ్లీ నువ్వు తానా తందానా : టిల్లూ స్క్వేర్ సాంగ్ రిలీజ్

టిల్లన్న ఎలాగన్న.. పోరి దెబ్బకి మళ్లీ నువ్వు తానా తందానా :  టిల్లూ స్క్వేర్ సాంగ్ రిలీజ్

సిద్దూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డీజే టిల్లూ స్క్వేర్’( DJTillusquare)​ తో మరోసారి అట్లుంటది మనతోటి అనిపించడానికి వస్తోన్న సంగతి తెలిసేందే. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'టికెట్ ఏ కొనకుండా.. ' అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.  కాసర్ల శ్యామ్(Kasarla Shyam)  రాసిన ఈ గీతం కుర్రాళ్లతో ఈలలు వేయించేలా ఉంది. సింగర్ రామ్ మిరియాల( Ram Miriyala) పాడి, స్వయంగా మ్యూజిక్ చేయాగ.. జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ యూత్ తో స్టెప్పులు వేయేంచేలా ఉంది.

'అల్లిగాడు..మల్లిగాడు కాదు..టిల్లుగాడు కిర్రాక్ వీడూ.. మత్తులోకి పల్లిలాగా..లొల్లి లేకుండా ఉండలేడు'  అంటూ హీరో క్యారెక్టర్ ను కాసర్ల శ్యామ్ వర్ణించడంతో సిద్దు మరోసారి హిట్ కొట్టడం పక్కా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే 'టిల్లన్న ఇలాగైతే ఎలాగన్న ..స్టోరీ మళ్ళీ రిపీట్ యేనా' అంటూ ఉన్న లిరిక్స్ తో డీజే టిల్లు ను మించేలా కాన్సెప్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. 

అలాగే సాంగ్ స్టార్టింగ్  లో వచ్చే హీరో హీరోయిన్​ మధ్య ఫ్లర్టింగ్ సీన్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడే కదా కలిశాం..అప్పుడే ఫ్లర్టింగా అంటూ అనుమప ఇచ్చే క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​కి తోడు టిల్లూ మార్క్​ డైలాగ్స్​ ఇందులో హైలెట్​గా నిలిచాయి. అనుపమ రోల్​పై క్యూరియాసిటీని పెంచేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ మూవీకి మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా..సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తుంది. సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.