
టాలీవుడ్ చిన్నది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) మరో ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించనుంది. సిద్దూ జొన్నలగడ్డతో ‘డీజే టిల్లూ స్క్వేర్’(DJ Tillu 2) లో ఈ హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ప్రోమోను విడుదల చేస్తూ.. టికెట్టే కొనకుండా సాంగ్ జూలై 26న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇందులో హీరో హీరోయిన్ మధ్య ఫ్లర్టింగ్ సీన్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడే కదా కలిశాం అప్పుడే ఫ్లర్టింగా అంటూ అనుమప ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి తోడు టిల్లూ మార్క్ డైలాగ్స్ ఇందులో హైలెట్‌గా నిలిచాయి. అనుపమ రోల్‌పై క్యూరియాసిటీని పెంచేలా ఈ ప్రోమో ఉంది. దీంతో అనుపమ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ఇక ఇప్పటికే కార్తికేయ 2 సక్సెస్‌తో ఈ బ్యూటీ జోరు మీదుంది. ప్యాన్ ఇండియా రేంజ్లో అనుపమకు ఎక్స్పోజర్ లభించింది. దీంతో కథల విషయంలో సెలక్టివ్‌గా ఉంటోందని టాక్.