మహిళా వ్యాపారవేత్తలకు.. టై హైదరాబాద్ ఆర్థికసాయం

మహిళా వ్యాపారవేత్తలకు.. టై హైదరాబాద్ ఆర్థికసాయం

హైదరాబాద్​, వెలుగు:   మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ టీ– వర్క్స్ లో  టై  హైదరాబాద్ చాప్టర్  గురువారం ఉమెన్ రోడ్ షో నిర్వహించింది. టై ఉమెన్ 2026 ఏడో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  రాష్ట్రవ్యాప్తంగా 200 దరఖాస్తులు సేకరిస్తారు. 

2019 జనవరి తర్వాత రిజిస్టర్ అయిన స్టార్టప్‌లు ఈనెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మహిళా వ్యవస్థాపకుల వాటా కనీసం 33 శాతం ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ నుంచి పెట్టుబడుల వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తారు.