
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ 3’. గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడో భాగానికి మనీశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కత్రినా కైఫ్.. ఇందులోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. దీపావళికి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌లో సల్మాన్, కత్రినా గన్స్ పట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘దీపావళికి వస్తున్నాం’ అంటూ సల్మాన్ ఖాన్, ‘నో లిమిట్స్, నో ఫియర్’ అంటూ కత్రినా కైఫ్ ఈ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ స్పై యూనివర్స్‌లో మూవీలో ‘పఠాన్’ చిత్రంలోని రా ఏజెంట్‌గా షారుఖ్, ‘వార్’ చిత్రంలోని మేజర్ కబీర్ పాత్రలో హృతిక్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్ రాణా, రేవతి, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.