మనుబోతును వెంటాడిన పెద్దపులి

మనుబోతును వెంటాడిన పెద్దపులి

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోరా సమీపంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పెద్దపులి మనుబోతును వేటాడుతుండగా రైతులు చూసి భయాందోళనకు గురయ్యారు. పెద్దపులి సంచరిస్తున్న విషయం ప్రత్యక్ష సాక్షుల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు దావానలంలా పాకింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పరిశీలించారు. రైతులు చెబుతున్న ప్రాంతంలో గాలించగా.. పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. పెద్దపులి సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు.