టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి టైమొచ్చింది

టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి టైమొచ్చింది

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాదు.. ప్రతి పండక్కి ఓ స్పెషల్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇస్తున్నాడు రవితేజ. ఉగాది సందర్భంగా నిన్న కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో  ప్రారంభించారు. ముహూర్తం షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి క్లాప్ కొట్టిన చిరంజీవి ప్రీ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా లాంచ్ చేశారు. ‘ద కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వివేక్ అగ్నిహోత్రి స్ర్కిప్ట్ అందించాడు. చిత్ర సమర్పకుడు తేజ్ నారాయణ్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘ప్యాండమిక్ కంటే ముందు ఈ కథ నాకు వినిపించాడు వంశీ. కుదరక చేయలేదు. అయితే ఈ స్టోరీకి రవితేజ కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సూటవుతాడు.  స్టూవర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురం టైగర్ నాగేశ్వరరావు గురించి నేను చిన్నప్పుడే విన్నాను. ఆయన గురించి చాలా హీరోయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పుకునేవారు. ఆయన కథతో సినిమా తీయడం ఆనందంగా ఉంది. ‘కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో ఆల్రెడీ సక్సెస్ మూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు.  తమ డెబ్యూ మూవీ రవితేజతో చేయడం హ్యాపీగా ఉందన్నారు హీరోయిన్స్ నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్. కీలక పాత్రలో నటిస్తున్న రేణూ దేశాయ్ మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం వంశీ నాకీ రోల్ గురించి చెప్పారు. అప్పటికి నాకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన లేదు. కానీ స్టోరీతో పాటు క్యారెక్టర్ బాగా నచ్చడంతో కమిటయ్యాను’ అని చెప్పింది. ‘ఇది డిఫరెంట్ ఫిల్మ్. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను’ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. నిర్మాతలు సునీల్ నారంగ్, విష్ణు ఇందూరి, దర్శకులు తేజ, శరత్ మండవ, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.