
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 20న సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు.
టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్‌గా కనిపించారు. మాసీ రోల్‌లో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఆకట్టుకుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘ఈ చిత్రం హిందీలోనూ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. హిందీలో కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. ఇదొక స్పెషల్ మూవీ అన్నారు దర్శకుడు వంశీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్. నటులు అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా, గాయత్రి పాల్గొన్నారు.