రిజల్ట్ ఫ్లాప్.. క్రేజ్ నెక్స్ట్ లెవల్.. మాస్ మహారాజా సంభవం లోడింగ్

రిజల్ట్ ఫ్లాప్.. క్రేజ్ నెక్స్ట్ లెవల్.. మాస్ మహారాజా సంభవం లోడింగ్

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. టైగర్ నాగేశ్వర రావు మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈమేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

"మాస్ మహారాజా సంభవం లోడింగ్.. టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్, రవితేజ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుంది. అతి త్వరలో ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో.. రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా  ఉంటే.. రిజల్ట్‌తో సబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. ఈ క్రమంలో పారితోషికం కూడా డబల్ చేశాడని సమాచారం. రవితేజ టైగర్ నాగేశ్వర రావు తర్వాత ‘ఈగల్’ మూవీ చేస్తున్నాడు. కలర్ ఫొటో డైరెక్టర్‌ సందీప్ రాజ్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట రవితేజ.

ఇక రవితేజ గత చిత్రం రావణాసుర బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా ఇండస్ట్రీలో రవితేజ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడంలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంత భారీ ఫ్లాప్ తరువాత కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, దానికి మేకర్స్ కూడా ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే.. రవితేజ క్రేజ్ పాన్ ఇండియా లెవల్ కు చేరడం ఖాయం.