కూతురు కోసం టిక్ టాక్ వీడియో చేసి పంపిన సోల్జర్

కూతురు కోసం టిక్ టాక్ వీడియో చేసి పంపిన సోల్జర్

ఉక్రెయిన్‎పై రష్యా చేస్తున్న యుద్ధంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కడి నుంచి ఏ బాంబు పడుతుందోనని తీవ్రంగా భయపడుతున్నారు. బాంబుల భయంతో చెట్టుకొకరు, పుట్టకొకరయ్యారు. తమ దేశం కోసం సైన్యంతో పాటు అక్కడి యువత కూడా గన్నులు పట్టారు. సైనికులయితే ఏకంగా తమ కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించి యుద్ధభేరిలోకి దిగారు. తాము ఎలా ఉన్నామో చెప్తూ.. అప్పుడప్పుడు ఫ్యామిలీకి వీడియోలు పంపుతున్నారు. ఈ తరహాలోనే ఉక్రెయిన్‎కు చెందిన ఓ సైనికుడు.. తన కూతురు కోసం వీడియో చేసి పంపాడు. హుక్ పంపిన వీడియోలలో అతను సైనిక యూనిఫాం ధరించి డ్యాన్స్ చేయడం, తోటి సైనికులు కూడా అతనితో డ్యాన్స్ చేయడం కూడా చూడవచ్చు.

ఉక్రెయిన్‎కు చెందిన అలెక్స్ హుక్‎కు కూతురంటే ప్రాణం. ఆమె కోసం గత సంవత్సరం డిసెంబర్ నుంచి టిక్ టాక్ వీడియోలు చేయడం ప్రారంభించాడు.  అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి హుక్.. టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేయడం అపేశాడు. పైగా.. గత కొన్ని రోజుల నుంచి కుటుంబసభ్యులతో కూడా టచ్‎లో లేడు.  దాంతో హుక్ చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు తెలుసుకున్న హుక్.. వెంటనే తన తోటి సైనికులతో కలిసి ఓ పాటకు టిక్ టాక్ వీడియో చేసి సోమవారం విడుదల చేశాడు. ‘నేను సజీవంగానే ఉన్నాను. ప్రస్తుతం డాన్‌బాస్ ప్రాంతంలో ఉండి.. ఉక్రెయిన్ కోసం పోరాటం కొనసాగిస్తున్నాను’ అని అతను హుక్ తన వీడియోలో చెప్పాడు. హుక్ సోషల్ మీడియాలోకి తిరిగి రావడంతో అతను క్షేమంగా ఉన్నాడని కన్ఫమ్ అయింది. దాంతో అతని ఫాలోవర్లు, కుటుబసభ్యులు, ముఖ్యంగా హుక్ కూతురు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. హుక్‎ తన టిక్ టాక్ ఖాతాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

For More News..

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు గుడ్ న్యూస్