పేరు లిల్లీ కావొచ్చు కానీ నువ్వు రాధికవే

పేరు లిల్లీ కావొచ్చు కానీ నువ్వు  రాధికవే

‘డీజే టిల్లు’ చిత్రంలో సిద్ధు పోషించిన టిల్లు క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో.. నేహా శెట్టి పోషించిన రాధిక క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అయింది. అందుకే ఈ మూవీకి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో ‘రాధిక.. రాధిక’ అంటూ పాట పాడుతున్నాడు టిల్లు. ‘నా పేరు రాధిక కాదు.. లిల్లీ’ అని అనుపమ పరమేశ్వరన్ చెబుతున్నా.. పేరు లిల్లీ కావొచ్చు కానీ నువ్వు మనిషివైతే హండ్రెడ్ పర్సెంట్ రాధికవే’ అంటున్నాడు. సోమవారం ఈ పాటను విడుదల చేశారు. రామ్ మిరియాల తనదైన శైలిలో కంపోజ్ చేసి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. 

‘రాధిక.. రాధిక.. రాధిక.. రాధిక.. ముందుకా, ఎనకక, కిందికా, మీదికా.. ముంచక తేల్చక ఆటలేందే ఇక.. కాటుక కళ్ల తోటి కాటే వేశావే నువ్వు.. సూటిగా చూసి దిల్లు టైటే చేశావే..’ అంటూ హీరోయిన్‌‌‌‌‌‌‌‌ను టీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సాగిన ఈ పాటలో అనుపమ గ్లామరస్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల  కానుంది.