‘డీజే టిల్లు’కు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’

‘డీజే టిల్లు’కు సీక్వెల్  ‘టిల్లు స్క్వేర్’

‘డీజే టిల్లు’తో కింతటేడాది సూపర్‌‌‌‌ సక్సెస్‌‌ను అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఈ ఇయర్‌‌‌‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్‌‌పై ఉండగానే మరో కొత్త సినిమాకు గ్రీన్‌‌ సిగ్నల్ ఇచ్చాడు సిద్ధు. 

మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా దీనిని అనౌన్స్ చేశారు. సుకుమార్‌‌‌‌ రైటింగ్స్‌‌తో కలసి బివిఎస్‌‌ఎన్ ప్రసాద్‌‌ నిర్మించబోతున్నారు. వైష్ణవి అనే కొత్త దర్శకురాలు పరిచయం అవుతోంది. అనౌన్స్‌‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో సిద్ధూ స్టైలిష్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్నాడు. అతని కెరీర్‌‌‌‌లో ఇది ఎనిమిదవ చిత్రం. లవ్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందే ఈ సినిమా షూటింగ్‌‌ను అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.